యాక్షన్‌ మొదలైంది!

ABN , First Publish Date - 2020-10-30T07:15:20+05:30 IST

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం షూటింగ్‌ గురువారం రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలైంది....

యాక్షన్‌ మొదలైంది!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం షూటింగ్‌ గురువారం రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలైంది. మిరియాల రవీంద్రరెడ్డి  నిర్మిస్తున్న చిత్రమిది. లాడ్‌డౌన్‌ తర్వాత మళ్లీ చిత్రీకరణ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆర్‌ఎ్‌ఫసీలో బాలకృష్ణ, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘సింహా’, లెజెండ్‌’ సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి కలయికలో వస్తున్న ఈ చిత్రం అంచనాలకు తగ్గకుండా హ్యాట్రిక్‌ విజయాన్ని సాధిస్తుందని దర్శకుడు బోయపాటి శ్రీను నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికలుగా అంజలి, ప్రయాగ మార్టిన్‌ పేర్లు వినిపిస్తున్నాయి.


Updated Date - 2020-10-30T07:15:20+05:30 IST