`ఆచార్య` సిద్ధమవుతున్నాడు!
ABN , First Publish Date - 2020-11-04T17:30:19+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న చిత్రం `ఆచార్య`.

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న చిత్రం `ఆచార్య`. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కోవిడ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ను పునః ప్రారంభించడానికి చిత్రయూనిట్ సిద్ధమైంది. ఈ నెల 9 నుంచి `ఆచార్య` షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ లాంగ్ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన చిత్రీకరణ దాదాపు పూర్తికానుంది. కోవిడ్ నేపథ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ పూర్తి చేయనున్నారు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.
Read more