పవన్ చేయలేని ‘సత్యాగ్రహి’ని ఆయన అభిమానులు చేస్తే..

ABN , First Publish Date - 2020-01-01T21:52:31+05:30 IST

గతంలో పవన్ కళ్యాణ్ ‘సత్యాగ్రహి’ అనే టైటిల్‌తో ఒక సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చ లేదు

పవన్ చేయలేని ‘సత్యాగ్రహి’ని ఆయన అభిమానులు చేస్తే..

గతంలో పవన్ కళ్యాణ్ ‘సత్యాగ్రహి’ అనే టైటిల్‌తో ఒక సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చ లేదు. అయితే ఆ టైటిల్‌తో... పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల స్ఫూర్తితో ‘సత్యాగ్రహి’ చిత్రాన్ని శ్రీ భవిత క్రియేషన్స్ పతాకంపై గంగారెడ్డి నిర్మిస్తుండగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేశారు.
 
పవన్ కళ్యాణ్‌ని స్ఫూర్తిగా తీసుకొని తన సిద్ధాంతాలను, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సమాజంపై యువత బాధ్యతతో ఉండాలని చెబుతూ.. పవన్ కళ్యాణ్ అభిమానులైన నలుగురు యువకులు సమాజాన్ని మార్చే బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథాంశం అన్నారు నిర్మాత గంగారెడ్డి. లవ్ స్టోరీస్, అడల్ట్ కంటెంట్, లిప్ లాక్‌లతో సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో ఇలా సొసైటీ‌పైన సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్న దర్శకుడు కృష్ణ చైతన్యకు అభినందనలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మ్యూజిక్: సాయి కార్తీక్, పాటలు: శర్మ, సురేష్ గంగుల, ఎడిటింగ్: శ్రీకాంత్, నిర్మాత: గంగారెడ్డి, స్టోరీ-స్క్రీన్‌ప్లే-డైలాగ్స్-డైరెక్షన్: కృష్ణ చైతన్య.

Updated Date - 2020-01-01T21:52:31+05:30 IST