హాస్పిటల్‌లో నాన్న డూప్ ఉన్నారేమో: అభిషేక్ కౌంటర్

ABN , First Publish Date - 2020-10-27T22:43:56+05:30 IST

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ స్పందించారు.

హాస్పిటల్‌లో నాన్న డూప్ ఉన్నారేమో: అభిషేక్ కౌంటర్

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ స్పందించారు. అమితాబ్ అనారోగ్యానికి గురైనట్టు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. అమితాబ్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.


అమితాబ్ అనారోగ్యంగా ఉన్నారని, శనివారం నుంచి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారని వస్తున్న వార్తల గురించి అభిషేక్ తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. `ఆయన ప్రస్తుతం నా ముందు కూర్చుని ఉన్నారు. బహుశా హాస్పిటల్ ఉన్నది ఆయన డూప్లికేట్ ఏమో` అని సమాధానం ఇచ్చారు. దీంతో బిగ్ బీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.  

Updated Date - 2020-10-27T22:43:56+05:30 IST