ఎట్టకేలకు అభిషేక్‌కూ నెగిటివ్
ABN , First Publish Date - 2020-08-08T21:47:22+05:30 IST
ఎట్టకేలకు అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ కరోనాని జయించారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చినట్లుగా అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. అంతకుముందు కరోనాని

ఎట్టకేలకు అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ కరోనాని జయించారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చినట్లుగా అభిషేక్ బచ్చన్ తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అంతకుముందు కరోనాని జయించి ఐశ్వర్యరాయ్, ఆరాధ్య ఆ తర్వాత బిగ్ బి అమితాబచ్చన్ డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అభిషేక్‌కు మాత్రం ఇప్పటి వరకు రెండో సారి టెస్ట్‌లోనూ పాజిటివ్ రావడంతో మరికొన్ని రోజులు హాస్పటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకోక తప్పలేదు. సుమారు నెలరోజుల తర్వాత అభిషేక్ కరోనాని జయించి తన ఇంటికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా.. ‘‘నేను ఇచ్చిన మాట ప్రకారమే కరోనాని జయించాను. ఈ మథ్యాహ్నం టెస్ట్‌లో నాకు కరోనా నెగిటివ్ అని తేలింది. నాకోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇంటికి వెళుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనాని జయించే క్రమంలో నా పట్ల ఎంతో కేర్ తీసుకున్న నానావతి హాస్పటల్ డాక్టర్స్, నర్సులు, ఇతర సిబ్బందికి ఎంతో రుణపడి ఉంటాను. అలాగే నా కుటుంబం ఇచ్చిన సపోర్ట్‌కు కూడా ధన్యవాదాలు..’’ అని అభిషేక్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read more