చిరు ‘ఆపద్బాంధవుడు’కు 28 ఏళ్ళు

ABN , First Publish Date - 2020-10-09T04:11:40+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవికి ఉత్తమ నటుడిగా రెండో సారి నంది అవార్డు తీసుకొచ్చిన చిత్రం ‘ఆపద్బాంధవుడు’. ఈ చిత్రం అక్టోబర్‌ 9తో 28 ఏళ్ళు పూర్తి

చిరు ‘ఆపద్బాంధవుడు’కు 28 ఏళ్ళు

మెగాస్టార్‌ చిరంజీవికి ఉత్తమ నటుడిగా రెండో సారి నంది అవార్డు తీసుకొచ్చిన చిత్రం ‘ఆపద్బాంధవుడు’. ఈ చిత్రం అక్టోబర్‌ 9తో 28 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు కొంచెంలో ఈ  చిత్రం మిస్ అయ్యింది. అలాగే అప్పట్లో 5 నంది అవార్డులు ఈ చిత్రం గెలుచుకుంది. ఈ చిత్రంలో చిరు అభినయం ఇంటిల్లిపాదినీ కట్టిపడేసింది. ముఖ్యంగా మానసిక వికలాంగుడిగా చిరు ప్రదర్శించిన అభినయం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే శివుని పాత్రలో సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యినట్టు ఉంటుంది ఈ చిత్రంలోని చిరంజీవి పాత్ర . మీనాక్షి శేషాద్రి కథానాయకిగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అలాగే ఎంఎం కీరవాణి అందించిన స్వరాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటాయి. 



కె.విశ్వనాథ్‌ - ఏడిద నాగేశ్వరరావు కలయికలో రూపొందిన ఆఖరు చిత్రం కూడా ఇదే. ఈ సినిమా తరువాత నిర్మాణానికి దూరమయ్యారు ఏడిద నాగేశ్వరరావు. అయితే నిర్మాతగా మాత్రం ఆయన్ని అన్ని విధాలా సంతృప్తిపరచిన చిత్రమిది. పూర్ణోదయ సంస్థ ప్రతిష్టని మరింత ఇనుమడింప చేసింది. జంధ్యాల తొలిసారి మేకప్‌ వేసుకొన్న చిత్రమిది. ఈ సినిమాకి సంభాషణలు అందించిన జంధ్యాల..ఇందులోని పరంధామరాజు పాత్రని ప్రేమించడం మొదలెట్టారు. చివరకి ఈ పాత్ర నేనే చేస్తా అని ఏడిద నాగేశ్వరరావుకి ఓ చీటి రాసిచ్చారు. చివరకి కె.విశ్వనాథ్‌ కూడా ఓకే అనడంతో జంధ్యాల కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర చేసి మెప్పించారు.







Updated Date - 2020-10-09T04:11:40+05:30 IST