కరణ్ జోహార్ నాతో అమర్యాదగా ప్రవర్తించాడు: ఆమిర్ ఖాన్ సోదరుడు

ABN , First Publish Date - 2020-09-08T20:40:48+05:30 IST

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లోని డార్క్ సీక్రెట్స్ బయటపడుతున్నాయి.

కరణ్ జోహార్ నాతో అమర్యాదగా ప్రవర్తించాడు: ఆమిర్ ఖాన్ సోదరుడు

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లోని డార్క్ సీక్రెట్స్ బయటపడుతున్నాయి. బాలీవుడ్‌లోని స్టార్ వారసత్వం, బంధుప్రీతి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 


ఆమిర్ ఖాన్ సోదరుడు, నటుడు ఫైజల్ ఖాన్ ఈ విషయాల గురించి తాజాగా స్పందించారు. `బాలీవుడ్‌లో గ్రూపిజం, బంధుప్రీతి ఉన్నాయి. ప్రపంచం మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. అందులో బాలీవుడ్ కూడా భాగమే. ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి స్వలాభం గురించే ఆలోచిస్తారు. మీరు పరాజయాల్లో ఉంటే.. మిమ్మల్ని చిన్నచూపు చూస్తారు. నాకూ అలా జరిగింది. నా సోదరుడు ఆమిర్ 50వ జన్మదినోత్సవ వేడుకలో కరణ్ జోహార్ నాతో అమర్యాదగా ప్రవర్తించాడు. నా గురించి చులకనగా మాట్లాడాడు. నేను వేరొకరితో మాట్లాడుతుంటే మా సంభాషణ కట్ చేయడానికి ప్రయత్నించాడ`ని ఫైజల్ చెప్పారు. ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లేకుండా మనుగడ సాగించడం కష్టమని అన్నారు. 

 


Updated Date - 2020-09-08T20:40:48+05:30 IST