'ఆకాశం నీ హద్దురా' ట్రైలర్
ABN , First Publish Date - 2020-10-26T16:12:33+05:30 IST
సూర్య హీరోగా 'గురు' ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శూరరై పోట్రు'. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం చిత్రయూనిట్ విడుదల చేసింది.

సూర్య హీరోగా 'గురు' ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శూరరై పోట్రు'. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. సూర్య హీరోగా నటించడమే కాదు..రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్, గునీత్ మోంగ, ఆలీఫ్ సుర్తితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం చిత్రయూనిట్ విడుదల చేసింది. ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ జీవితకథను తెలియజేసిన పుస్తకం 'సింప్లి ఫై'. ఈ పుసక్తానికి కల్పిత వెర్షన్‌గా రూపొందిన చిత్రమిది. కోవిడ్ ప్రభావంతో సినిమా థియేటర్స్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో సూర్య సహా మిగిలిన మేకర్స్ అందరూ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. అక్టోబర్ 30న విడుదల చేయాలనుకున్నారు కానీ.. మరో రెండు వారాలు ఆలస్యంగా అంటే నవంబర్ 12న 'ఆకాశం నీ హద్దురా' చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ప్రకటించింది. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఇందులో కీలక పాత్ర పోషించారు. ఓ సామాన్య యువకుడు ఎయిర్‌ఫోర్స్ ఫైలైట్ అవుతాడు. ఆ తర్వాత ఓ విమాన సంస్థను ప్రారంభిచాలని అనుకుంటాడు. ఆ క్రమంలో అతనెలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడనే కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది.. ఆ ట్రైలర్ మీ కోసం....