డబ్బింగ్ ప్రారంభించిన ఆది సాయికుమార్!

ABN , First Publish Date - 2020-06-29T22:51:40+05:30 IST

ఆది సాయికుమార్ హీరోగా న‌టిస్తోన్న `శ‌శి` సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఈ రోజు (సోమవారం) ప్రారంభమయ్యాయి.

డబ్బింగ్ ప్రారంభించిన ఆది సాయికుమార్!

ఆది సాయికుమార్ హీరోగా న‌టిస్తోన్న `శ‌శి` సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఈ రోజు (సోమవారం) ప్రారంభమయ్యాయి. ఆది సరసన సురభి హీరోయిన్‌గా నటించింది. రాశీ సింగ్ మరో హీరోయిన్. శ్రీ‌నివాస్ నాయుడు రూపొందించిన ఈ చిత్రాన్ని శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆర్‌.పి.వ‌ర్మ‌, రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాస్ నిర్మించారు. ఒక్క పాట మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని నిర్మాత తెలిపారు. 


లాక్‌డౌన్ ముగిసి సినిమాల‌ షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చిన నేపథ్యంలో అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటూ డ‌బ్బింగ్ ప‌నులను చిత్రబృందం ప్రారంభించింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ  సినిమాకు అరుణ్ చిలువేరు సంగీతం అందించగా, అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు

Updated Date - 2020-06-29T22:51:40+05:30 IST