శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆదా శర్మ కొత్త చిత్రం
ABN , First Publish Date - 2020-07-27T19:24:31+05:30 IST
శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఆదా శర్మ, సంజయ్, భానుశ్రీ, అభయ్, హరి తేజ, అక్షిత శ్రీనివాస్ మరియు అజయ్ ముఖ్య తారాగణంగా కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఆదా శర్మ, సంజయ్, భానుశ్రీ, అభయ్, హరి తేజ, అక్షిత శ్రీనివాస్ మరియు అజయ్ ముఖ్య తారాగణంగా కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విప్రా దర్శకత్వంలో గౌరీ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ ‘‘ఈ కరోనా టైంలో ధైర్యంగా సినిమాను ప్రారంభించాం. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడిని పరిచయం చేయటం చాలా ఆనందం గా ఉంది. ఆదా శర్మ మా చిత్రంలో హీరోయిన్‌గా ముఖ్య పాత్లో నటిస్తున్నారు. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్. షూటింగ్ ప్రారంభించాం. ఏకధాటి షెడ్యూల్‌తో ఈ చిత్రాన్ని పూర్తిచేయాలని అనుకుంటున్నాం. కథ చాలా బాగుంది’’ అని తెలిపారు.
హీరోయిన్ ఆదా శర్మ మాట్లాడుతూ‘‘నా గత చిత్రాలు ‘హార్ట్ ఎటాక్, క్షణం’ నాకు మంచి పేరు తెచ్చాయి, ప్రేక్షకులు నానుంచి మంచి సినిమాలు కోరుకుంటున్నారు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఇది. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‘‘ అన్నారు.
హైదరాబాద్‌లో పది రోజులు చిత్రీకరణ జరిపి మిగతా భాగాన్ని నిర్మల్‌లో చిత్రీకరిస్తామని దర్శకుడు విప్రా తెలిపారు.