నిరాడంబరంగా వివాహం

ABN , First Publish Date - 2020-05-14T11:18:14+05:30 IST

యువ హీరో నిఖిల్‌, డాక్టర్‌ పల్లవీ వర్మ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గురువారం ఉదయం 6.31 గంటలకు శుభ ముహూర్తాన హైదరాబాద్‌ నగర శివార్లలో షామీర్‌పేట్‌లోని ఒక రిసార్ట్‌లో పెళ్లి జరిగిందని తెలిసింది...

నిరాడంబరంగా వివాహం

యువ హీరో నిఖిల్‌, డాక్టర్‌ పల్లవీ వర్మ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గురువారం ఉదయం 6.31 గంటలకు శుభ ముహూర్తాన హైదరాబాద్‌ నగర శివార్లలో షామీర్‌పేట్‌లోని ఒక రిసార్ట్‌లో పెళ్లి జరిగిందని తెలిసింది. వధూవరుల కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో నిఖిల్‌ ఏడడుగులు వేశారు. తొలుత ఏప్రిల్‌ 16న ఆయన వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే... కరోనా వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో వాయిదా వేసుకున్నారు. వధూవరుల జాతకాల రీత్యా గురువారం ఉదయం ముహూర్తం బావుండడంతో ప్రభుత్వం సూచించిన పద్దతుల్లో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు.


Updated Date - 2020-05-14T11:18:14+05:30 IST