రికార్డుల `అఆ`!

ABN , First Publish Date - 2020-05-27T17:27:41+05:30 IST

నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన సినిమా `అఆ`.

రికార్డుల `అఆ`!

నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన సినిమా `అఆ`. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 2016లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భారీ కలెక్షన్లు సాధించింది. తెలుగులోనే కాదు హిందీలో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. 


త్రివిక్రమ్ శైలి కథనం, డైలాగులు హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. యూట్యూబ్‌లో ఉన్న ఈ సినిమా హిందీ వెర్షన్‌ను ఇప్పటి వరకు 20 కోట్ల మంది వీక్షించారు. పది లక్షలకు పైగా లైకులు వచ్చాయి. `అఆ` కారణంగా హీరో నితిన్‌ సినిమాలకు హిందీ డబ్బింగ్ మార్కెట్‌లో మంచి ఆదరణ దక్కుతోంది. 

Updated Date - 2020-05-27T17:27:41+05:30 IST