`83` వచ్చేస్తోంది!
ABN , First Publish Date - 2020-10-12T20:46:20+05:30 IST
ఈ నెల 15 నుంచి థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమ సినిమాలను విడుదల చేసేందుకు

ఈ నెల 15 నుంచి థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమ సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రిలయెన్స్ సంస్థ నిర్మించిన అక్షయ్ కుమార్ `సూర్యవంశీ`, రణ్‌వీర్ సింగ్ `83` సినిమాల విడుదలకు సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది.
`సూర్యవంశీ` సినిమాను దీపావళికి, `83` సినిమాను క్రిస్‌మస్‌కు విడుదల చేయాలని నిర్మాణ సంస్థ భావించింది. అయితే అక్షయ్ అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పడం లేదు. `సూర్యవంశీ`ని వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే `83` మాత్రం ప్రకటించిన సమయానికి అంటే క్రిస్‌మస్ రోజున విడుదలైపోతుంది. 1983 ప్రపంచకప్ నేపథ్యంగా ఈ సినిమా రూపొందింది. కపిల్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటించగా, ఆయన భార్య పాత్రలో దీపిక కనిపించనుంది.
Read more