63 టు 58 కేజీలు...

ABN , First Publish Date - 2020-10-21T10:37:26+05:30 IST

‘‘నేను ఎంత దూరం వెళ్లగలనో చూద్దాం’’ అని కథానాయిక పాయల్‌ రాజ్‌పుత్‌ అంటున్నారు. ప్రస్తుతం ఆమె బరువు తగ్గే పనిలో ఉన్నారు...

63 టు 58 కేజీలు...

‘‘నేను ఎంత దూరం వెళ్లగలనో చూద్దాం’’ అని కథానాయిక పాయల్‌ రాజ్‌పుత్‌ అంటున్నారు. ప్రస్తుతం ఆమె బరువు తగ్గే పనిలో ఉన్నారు. ఇంతకు ముందు 63 కేజీలు ఉండగా, ఇప్పుడు 58 కేజీలు ఉన్నానని వెల్లడించారామె. పాయల్‌ అసలు టార్గెట్‌ బరువు తగ్గడం కాదు... యాబ్స్‌ బిల్డ్‌ చేయడమట! ‘‘డియర్‌ యాబ్స్‌... ఇప్పుడు మిమ్మల్ని నేను చూడలేను. కానీ, ఫీల్‌ అవుతున్నాను. త్వరలో మిమ్మల్ని కలవాలని ఎదురుచూస్తున్నా’’ అని పాయల్‌ రాజ్‌పుత్‌ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఎటువంటి పురోగతి లేకపోవడం కంటే... కనీసం నెమ్మదిగా అయినా పురోగతి సాధిస్తుండటం మంచిదేనని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ముంబై తరచూ వెళ్లి రావడం, ప్రయాణాలు చేయడం శ్రేయస్కరం కాదని, కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు.

Updated Date - 2020-10-21T10:37:26+05:30 IST