54 ఏళ్ల క్రితం.. ఇదే రోజున!

ABN , First Publish Date - 2020-12-15T10:30:06+05:30 IST

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భూలోకంలో తన పని ముగించుకొని , పై లోకాలకు వెళ్లిపోయి అప్పుడే రెండు నెలలు దాటింది...

54 ఏళ్ల క్రితం.. ఇదే రోజున!

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  భూలోకంలో తన పని ముగించుకొని , పై లోకాలకు వెళ్లిపోయి అప్పుడే  రెండు నెలలు దాటింది.  అయినా ఆయన పాట మాత్రం ప్రతిరోజూ వినిపిస్తూనే ఉంది. ఆయన మన దగ్గరే ఉన్న భావన కలిగిస్తోంది. 16 భాషల్లో, 40 వేలకు పైగా పాటలు పాడిన అరుదైన గాయకుడు బాలు. కేవలం గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఆయనది  భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓ ప్రత్యేక  అధ్యాయం. 


ఓ పాటల పోటీలో పాల్గొన్న బాలసుబ్రహ్మణ్యం ప్రతిభను పసికట్టి, ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రంలో తొలిసారిగా ఆయనతో పాడించారు సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి. 1966 డిసెంబర్‌ 15న సాయంత్రం ఆరు గంటలకు బాలు తొలి పాట ‘ఏమి ఈ వింత మోహం’ రికార్డ్‌ అయింది. అంటే నేటికి సరిగ్గా 54 ఏళ్ల క్రితం అన్నమాట. అప్పటివరకూ ఘంటసాల పాటకు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులను,  సంగీత ప్రియులను  ఈ కొత్త స్వరం ఆకర్షించింది. అనతికాలంలోనే ఆ గొంతు ప్రేక్షకులకు దగ్గరయింది. ఇక అక్కడినుంచి వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశం బాలుకు కలగలేదు.

Updated Date - 2020-12-15T10:30:06+05:30 IST