విక్రమ్‌ కోసం 50 రోజుల ప్లాన్‌

ABN , First Publish Date - 2020-11-13T10:46:47+05:30 IST

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ చేస్తోన్న కొత్త చిత్రం ‘విక్రమ్‌’. వారం క్రితమే కమల్‌హాసన్‌ పుట్టిన రోజు సందర్భంగా...

విక్రమ్‌ కోసం 50 రోజుల ప్లాన్‌

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ చేస్తోన్న కొత్త చిత్రం ‘విక్రమ్‌’. వారం క్రితమే కమల్‌హాసన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించి టీజర్‌ను విడుదల చేశారు. జనవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. షూటింగ్‌ను 50 రోజుల్లోనే పూర్తి చేసేందుకు చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందని సమాచారం. మార్చి-ఏప్రిల్‌ నెలల్లో కమల్‌హాసన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండడమే దానికి కారణంగా చెపుతున్నారు.


Updated Date - 2020-11-13T10:46:47+05:30 IST