4 మిలియన్‌ క్లబ్‌లో స్వీటీ

ABN , First Publish Date - 2020-10-14T02:22:42+05:30 IST

స్వీటీ అనుష్క ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. తను నటించిన నిశ్భబ్దం చిత్ర ప్రమోషన్‌లో భాగంగా

4 మిలియన్‌ క్లబ్‌లో స్వీటీ

స్వీటీ అనుష్క ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. తను నటించిన నిశ్భబ్దం చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్విట్టర్‌ ఎంట్రీ కూడా ఇచ్చిన అనుష్క.. ఆ తర్వాత నుంచి రెగ్యులర్‌గా ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంది. దీంతో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా పెరుగుతుంది. తాజాగా ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య 4 మిలియన్లకు చేరింది. సోషల్‌ మీడియాకు చెందిన ఇన్‌స్టాగ్రమ్‌లో తన ఫాలోవర్స్‌ 4 మిలియన్లకు చేరిందని తెలుపుతూ.. అనుష్క ఓ పోస్ట్ చేసింది.


'అందరికీ ధన్యవాదాలు..' అని తెలిపిన అనుష్క.. తన ఫొటోలతో నింపిన 4 మిలియన్ల పోస్టర్‌ను షేర్‌ చేసింది. ఈ పోస్టర్‌ మీద 'ధన్యవాదాలు.. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.. ప్రేమతో మీ అనుష్క' అని ఆమె సంతకం చేసి ఉంది. అనుష్క 4 మిలియన్ల క్లబ్‌లో చేరిన సందర్భంగా ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Updated Date - 2020-10-14T02:22:42+05:30 IST