`ప్రేమ్‌నగర్`కు 49 ఏళ్లు: సురేష్ ప్రొడక్షన్స్

ABN , First Publish Date - 2020-09-24T19:57:14+05:30 IST

తెలుగు సినీ పరిశ్రమ రూపొందించిన అద్భుత చిత్రాలలో `ప్రేమ్‌నగర్` సినిమా ఒకటి

`ప్రేమ్‌నగర్`కు 49 ఏళ్లు: సురేష్ ప్రొడక్షన్స్

తెలుగు సినీ పరిశ్రమ రూపొందించిన అద్భుత చిత్రాలలో `ప్రేమ్‌నగర్` సినిమా ఒకటి. కేఎస్ ప్రకాశ్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా నటించారు. భారీ విజయం సాధించిన ఈ చిత్రం ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా విడుదలై 49 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుర్తు చేసుకుంది. 


`ప్రేమ్‌నగర్` సినిమాకు పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇక, తమ సంస్థ రూపొందించిన మరో క్లాసిక్ `ప్రేమమందిరం`ను కూడా గుర్తు చేసుకుంది. దాసరి నారాయణ రావు రూపొందించిన ఈ సినిమాలో నాగేశ్వరరావు, జయప్రద జంటగా నటించారు. ఈ సినిమా విడుదలై 39 ఏళ్లు పూర్తయ్యాయి. `ప్రేమమందిరం` సినిమాకు పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది.


Updated Date - 2020-09-24T19:57:14+05:30 IST