అమెరికాలో 45 రోజులు!
ABN , First Publish Date - 2020-10-05T07:51:36+05:30 IST
మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. నవంబర్‌లో చిత్రీకరణకు చిత్రబృందమంతా అమెరికా వెళ్లనున్నారు...

మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. నవంబర్‌లో చిత్రీకరణకు చిత్రబృందమంతా అమెరికా వెళ్లనున్నారు. అక్కడ 45 రోజుల పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. మళ్లీ జనవరిలో ఇండియాకి తిరిగొస్తారట. బ్యాంకింగ్ రంగంలో మోసాలు, కుట్రల నేపథ్యంలో జనరంజకమైన కథను పరశురామ్ సిద్ధం చేశారట. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయికగా నటించనుందని సమాచారం. చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తొలుత చిత్రానికి పీఎస్ వినోద్‌ను ఛాయాగ్రాహకుడిగా తీసుకున్నారు. ఆయన ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరడం లేదట. అందుకని, మరో ఛాయాగ్రాహకుడు మదిని తీసుకున్నారని సమాచారం. వచ్చే ఏడాది విజయదశమికి చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారట. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.