‘ఫోర్ ప్లే’.. చిత్ర ట్రైలర్ విడుదల

ABN , First Publish Date - 2020-08-30T21:40:56+05:30 IST

ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రాంబాబు మీడియా హౌస్ సమర్పణలో శ్యామ్, హరిణి హీరోహీరోయిన్లుగా.. చిక్కవరపు రాంబాబు నిర్మాతగా.. పాలకుర్తి ప్రసాద్ అనే యువకుడిని

‘ఫోర్ ప్లే’.. చిత్ర ట్రైలర్ విడుదల

ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రాంబాబు మీడియా హౌస్ సమర్పణలో శ్యామ్, హరిణి హీరోహీరోయిన్లుగా.. చిక్కవరపు రాంబాబు నిర్మాతగా.. పాలకుర్తి ప్రసాద్ అనే యువకుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘ఫోర్ ప్లే’. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ని, చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చిక్కవరపు రాంబాబు మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.




ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా యొక్క ప్రధాన ఉద్దేశ్యం ‘ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత చిన్న చిన్న సంతోషాల కోసం ఎలా పెడదోవ పడుతున్నారో.., ఇంటికి దీపం ఇల్లాలుగా ఉండాల్సిన మహిళలు అమాయకంగా తీసుకునే నిర్ణయాల వల్ల ఎలా బ్లాక్ మెయిలింగ్‌కు గురి కాపాడుతున్నారో.., అలాకాకుండా డబ్బు, ఇతరత్రా విషయాలు జీవితంలో  తుచ్చమైనవిగా భావించి.. ప్రేమించడం, ప్రేమించబడ్డ వ్యక్తితో నమ్మకంగా ఉండడం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పడమే. చిత్రీకరణ అంతా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రాన్ని కూడా విడుదల చేస్తాము..’’ అని తెలిపారు.

Updated Date - 2020-08-30T21:40:56+05:30 IST