పాతికేళ్ల ప్రయాణం...

ABN , First Publish Date - 2020-12-21T07:10:04+05:30 IST

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో మేనేజర్‌గా కెరీర్‌ ప్రారంభించి ప్రచార తదితర విభాగాల్లో పని చేసి 25 వసంతాలు పూర్తి...

పాతికేళ్ల ప్రయాణం...

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో మేనేజర్‌గా కెరీర్‌ ప్రారంభించి ప్రచార తదితర విభాగాల్లో పని చేసి 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు వి. రఘునాథ్‌ బాబు. కౌన్సిల్‌లో ఇన్నేళ్ల జర్నీ ఎంతో నేర్పిందని, అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయని ఆయన అన్నారు. ‘‘1995లో నిర్మాతల మండలిలో అడుగుపెట్టా. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పరిశ్రమలో ఎన్నో మార్పులు చూశా. ఒకే సంస్థలో ఏకధాటిగా పాతికేళ్ల ప్రయాణం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం కరోనా వల్ల పరిశ్రమ కాస్త ఇబ్బందుల్లో ఉంది. త్వరలో మామూలు రోజులు వస్తాయి. బంగారు భవిష్యత్తు ముందుంది’’ అని రఘు తెలిపారు. 

Updated Date - 2020-12-21T07:10:04+05:30 IST