మహేష్‌ ఫస్ట్, పవన్‌ సెకండ్‌.. 10వ స్థానంలో చిరు

ABN , First Publish Date - 2020-12-15T01:04:18+05:30 IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మొదటి స్థానం, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రెండో స్థానంలో ఉండగా.. మెగాస్టార్‌ చిరంజీవి 10వ స్థానంలో నిలిచారు. ఏంటీ లెక్కలు అనుకుంటున్నారు కదా..!

మహేష్‌ ఫస్ట్, పవన్‌ సెకండ్‌.. 10వ స్థానంలో చిరు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మొదటి స్థానం, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రెండో స్థానంలో ఉండగా.. మెగాస్టార్‌ చిరంజీవి 10వ స్థానంలో నిలిచారు. ఏంటీ లెక్కలు అనుకుంటున్నారు కదా..!. ట్విట్టర్‌లో స్టార్ల పేర్ల మీద ఎక్కువగా ట్వీట్స్ ఎవరి పేరు మీద నమోదు అయ్యాయో తాజాగా ట్విట్టర్‌ ప్రకటించింది. 2020 ముగుస్తున్న సందర్భంగా.. ఈ ఇయర్‌కి సంబంధించి ట్రెండింగ్‌ అయిన హీరోల, హీరోయిన్‌ల, సినిమాల టాప్‌ టెన్‌ లిస్ట్‌ని తాజాగా ట్విట్టర్‌ విడుదల చేసింది. సౌత్‌కి సంబంధించి టాప్‌ టెన్‌ లిస్ట్ ఇలా ఉంది. 1. మహేష్‌ బాబు, 2. పవన్‌ కల్యాణ్‌, 3. విజయ్‌, 4. తారక్‌(ఎన్టీఆర్‌), 5. సూర్య, 6. అల్లు అర్జున్‌, 7. రామ్‌ చరణ్‌, 8. ధనుష్‌, 9. మోహన్‌లాల్‌, 10. చిరంజీవి. అయితే పాన్‌ ఇండియా స్టార్‌గా దూసుకుపోతోన్న ప్రభాస్‌కి ట్విట్టర్‌లో అకౌంట్‌ లేకపోవడంతో.. ఆయన ఈ లిస్ట్‌లో మిస్సయ్యారు. లేదంటే ప్రభాస్‌ కూడా ఈ లిస్ట్‌లో ఉండేవారిని ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌ ఈ ఇయర్‌ మిడిల్‌లో ట్విట్టర్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.Updated Date - 2020-12-15T01:04:18+05:30 IST

Read more