లారెన్స్‌ ట్రస్టులో 20 మందికి కరోనా!

ABN , First Publish Date - 2020-05-27T12:12:36+05:30 IST

ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు రాఘవ లారెన్స్‌ నడుపుతున్న చారిటబుల్‌ ట్రస్టులో ఆశ్రయం పొందుతున్న

లారెన్స్‌ ట్రస్టులో 20 మందికి కరోనా!

చెన్నై : ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు రాఘవ లారెన్స్‌ నడుపుతున్న చారిటబుల్‌ ట్రస్టులో ఆశ్రయం పొందుతున్న 20 మందికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. 2006లో లారెన్స్‌ స్థాపించిన చారిటబుల్‌ ట్రస్టు తరపున స్థానిక అశోక్‌నగర్‌లో అనేక మంది నిరాశ్రయులను పోషిస్తున్నారు. కరోనా నిరోధక చర్యల్లో భాగంగా గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ సిబ్బంది చేపడుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా లారెన్స్‌ చారిటబుల్‌ ట్రస్టులో ఉన్న పలువురికి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా, 20 మందికి పాజిటివ్‌ వచ్చింది.


దీంతో వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు జీసీసీ అధికారులు తెలిపారు. అలాగే ట్రస్టు వసతి గృహాన్ని మూసివేసి, క్రిమినాశిని మందు చల్లారు. అలాగే ఆ వసతి గృహం చుట్టుపక్కల ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌జోన్‌గా ప్రకటించారు.

Updated Date - 2020-05-27T12:12:36+05:30 IST