`ఖుషి`కి 19ఏళ్లు!

ABN , First Publish Date - 2020-04-27T17:05:25+05:30 IST

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా దర్శకుడు ఎస్‌జే సూర్య రూపొందించిన చిత్రం `ఖుషి`.

`ఖుషి`కి 19ఏళ్లు!

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా దర్శకుడు ఎస్‌జే సూర్య రూపొందించిన చిత్రం `ఖుషి`. దాదాపు 19 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం పవన్ కెరీర్‌లోనే గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. యువతలో పవన్‌కు మరింత ఫాలోయింగ్ పెంచింది. పవన్, భూమిక పోటాపోటీ నటన, వారి మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. 


ఇక, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. అలాగే నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఛాయగ్రహణం మరో ప్రధాన ఆకర్షణ. 2001 ఏప్రిల్ 26న విడుదలైన ఈ చిత్రం 79 సెంటర్లలో వంద రోజులాడింది. ఇక, ఇప్పటివరకు 300 పైచిలుకు సార్లు టీవీల్లో ప్రదర్శితమైనప్పటికీ ఈ సినిమాకు ఆదరణ పెరుగుతూనే ఉంది. 

Updated Date - 2020-04-27T17:05:25+05:30 IST