‘118’ తర్వాత మరో థ్రిల్లర్‌తో వస్తోన్న కేవి గుహన్‌

ABN , First Publish Date - 2020-12-15T21:59:35+05:30 IST

కల్యాణ్‌ రామ్‌, నివేథా థామస్‌, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా '118' వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహ‌న్ త‌న త‌దుప‌రి చిత్రంగా

‘118’ తర్వాత మరో థ్రిల్లర్‌తో వస్తోన్న కేవి గుహన్‌

కల్యాణ్‌ రామ్‌, నివేథా థామస్‌, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా '118' వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహ‌న్ త‌న త‌దుప‌రి చిత్రంగా మ‌రో డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (హూ, వేర్‌, వై) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ మూవీని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు ద‌ట్ల నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్నఈ సినిమా వివరాలను నిర్మాత డా. రవి పి.రాజు దట్ల తెలిపారు.


ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''కేవి గుహ‌న్‌గారు తెర‌కెక్కించిన 118 మూవీ ఎంత‌పెద్ద హిట్లో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆయ‌న రెండో చిత్రంగా మరో డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ మూవీని రూపొందిస్తున్నారు. రామంత్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ఈ మూవీ రూపొందుతోంది. సిమ‌న్ కె. కింగ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా మిర్చికిర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ అందిస్తున్నారు. టెక్నిక‌ల్‌గా మంచి టీమ్ కుదిరింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వ‌ర‌లోనే  టైటిల్ లోగోని విడుద‌ల‌ చేస్తాం".. అని తెలిపారు.

Updated Date - 2020-12-15T21:59:35+05:30 IST